వీల్ బ్రేక్ లాక్.. మిర్యాలగూడలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ నిలిపివేత..

fulaknuma-06.jpg

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ నిలిపివేశారు అధికారులు. దీంతో ప్రయాణికులు భాయందోళనకు గురయ్యారు. మిర్యాలగూడకు రాగానే రైలును నిలిపివేయండో ప్రయాణికులకు గందరగోళ పరిస్థితి ఎదురైంది. వీల్ బ్రేక్ లాక్ కావడంతో ట్రైన్ నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ట్రైన్ ను ఒక్కసారిగా వీల్‌ బ్రేక్‌ లాక్‌ అయ్యింది. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన అధికారులు వీల్ బ్రేక్ మరమ్మత్తులు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. మరమ్మత్తులు కాగానే ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుందని తెలిపారు.

Share this post

scroll to top