బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ..

trafic-08.jpg

దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ సందడిగా మారింది. తెలంగాణ రాష్ట్రం నుంచి దసరాకు వెళ్లే ప్రయాణికులు ఇంటి బాట పడతుండటంతో బస్సులు, రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. శనివారం వచ్చే విజయదశమికి మరికొన్ని రోజులు మాత్రమే ఉండడంతో హైదరాబాద్‌లోని అన్ని బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సందడి నెలకొంది. హైదరాబాద్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల కొన్ని జిల్లాలకు ప్రజల భారీ తరలివెళుతున్నారు. ప్రతి ఒక్కరూ శనివారం లోపు వారి స్వగ్రామాలకు వెళ్లి వారి వారి కుటుంబాలతో గడిపేందుకు బయలు దేరారు. సికింద్రాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ , జూబ్లీ బస్ స్టేషన్ వంటి ప్రధాన బస్ స్టేషన్‌లు రిజర్వ్ చేసిన టిక్కెట్‌లతో చేరుకునే వారి సంఖ్య పెరిగింది. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వేస్టేషన్‌లు అన్ని ప్రయాణికులతో సందడిగా మారాయి.

Share this post

scroll to top