పీరియడ్స్‌లో బ్రెస్ట్ పెయిన్ వస్తుందా.. 

date-28.jpg

పీరియడ్స్ అనేది మహిళలకు వచ్చే సాధారణ సమస్య. పీరియడ్స్‌ వచ్చినప్పుడు మహిళల్లో అనేక మార్పులు కనిపిస్తాయి, ఎన్నో హార్మోన్లు చేంజ్ అవడం వల్ల మహిళల్లో పలు రకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కొంత మంది అరుస్తూ, చిరాకు పడుతూ ఉంటారు. మరికొంత మందికి చాలా అలసటగా నీరసంగా ఉంటుంది. ఏ పనీ చేయలేరు. ఇలా అనేక రకాల మార్పులు కనిపిస్తాయి. నెలసరిలో వచ్చే మార్పులు కామన్‌గా అనుకుంటారు. కానీ ఎలాంటి మార్పులు వచ్చినా వైద్యుల్ని సంప్రదించడం మేలు. చాలా మందిలో తీవ్రంగా కడుపులో నొప్పి, నడుము నొప్పవి వేధిస్తుంది. ఇంకొంత మందికి తీవ్రంగా రక్త స్రావం అవుతుంది. అలాగే కొందరిలో రొమ్ములు కూడా నొప్పిగా ఉంటాయి. ఎంతో మందికి ఇలా అనిపించినా.. పెద్దగా గమనించారు. 

ఎందుకు వస్తుంది..

బ్రెస్ట్‌లో పెయిన్ రావడం అనేది నెలసరిలో వచ్చే సాధారణ లక్షణం. ఇది హార్మోన్ల మార్పుల వలన వస్తుంది. రొమ్ములు బరువుగా అనిపించడం, నొప్పులు రావడం ఉంటాయి. ఇది ఎక్కువ మందిలో కనిపించే లక్షణం. రుతుక్రమం ఆగిపోయినప్పుడు నొప్పులు కూడా కంట్రోల్ అవుతాయి. పీరియడ్స్‌లో ఈస్ట్రోజెన్, ప్రాసెస్టరాన్ హార్మోన్లు కొందరిలో తగ్గుతాయి. దీని కారణంగా బ్రెస్ట్ పెయిన్స్ వస్తాయి.

ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి..

కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల కూడా రొమ్ములు తీవ్రంగా నొప్పులు వస్తాయి. కాబట్టి రొమ్ములు నొప్పిని కలిగించే ఆహారాలు తినడం మానేయండి. ఆల్కహాల్, ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు. కొవ్వు అధికంగా లభించే ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. అవకాడో, అరటి పండ్లు, పాలకూర, బ్రైన్ రైస్, వేరు శనగ, క్యారెట్లు వంటి ఆహారాలను తీసుకోండి. విటమిన్ ఈ ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే రొమ్ములు నొప్పులు రావు.

Share this post

scroll to top