బియ్యం అక్రమ రవాణా చేస్తుంది ఆర్థిక మంత్రి వియ్యంకుడే ..

ys-11.jpg

రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధులతో నేడు వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వై.ఎస్ జగన్ పార్టీ నేతలతో మాట్లాడుతూ రేషన్ బియ్యం వ్యవహారంపై వారి కథనాలు, మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. అసలు అధికారంలో ఎవరు ఉన్నారు అని సందేహం వస్తుందన్నారు వై.ఎస్ జగన్. రాష్ట్రంలో రేషన్ మాఫియా మళ్లీ వచ్చిందని జగన్ ఆరోపించారు.

రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆయన మండిపడ్డారు. ప్రజలకు నాణ్యమైన స్వర్ణరకం బియ్యం ఇవ్వడంలేదని, ప్రజలకు నాసిరకం బియ్యం ఇస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక మంత్రి వియ్యంకుడు బియ్యం అక్రమ ఎగుమతులు చేస్తున్నారని ఆరోపించారు జగన్. కానీ నిందలు మాత్రం తమపై వేస్తున్నారని ఫైర్ అయ్యారు. బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు మాజీ ముఖ్యమంత్రి. పయ్యావుల వియ్యంకుడు బియ్యం ఎగుమతుల్లో నెంబర్ వన్ అని అన్నారు.

Share this post

scroll to top