కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డా.సుధాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో గురువారం ఇంటిలో ఉన్న మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం ఓర్వకల్లు పోలీసు స్టేషన్‌కు తరలించారు. తన ఇంట్లో పనిచేస్తున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఎన్నికల సమయంలోనే డాక్టర్ సుధాకర్‌పై ఆరోపణలు వచ్చారు. బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఓ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయంపై మహిళా సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి కూడా. అయితే అప్పుడు పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయితే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. తాజాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డా.సుధాకర్‌ను అరెస్ట్ చేశారు. సుధాకర్ అరెస్ట్ ప్రస్తుతం కర్నూలులో హాట్‌టాపిక్‌గా మారింది.