ప్పుడేం జరుగుతుందో చెప్పలేం.. ఫలితాలపై బొత్స షాకింగ్ కామెంట్స్

botsa-ah.jpg

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 151 సీట్లు ఉన్న వైసీపీ బలం 11 సీట్లకు పడిపోయింది. మాజీ మంత్రులు, కీలక నేతలు అంతా ఓటమి చెందారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి పోటీ చేసిన నలుగురికి నలుగురు ఓడిపోయారు. చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బొత్స, విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సతీమణి బొత్స ఝాన్సీ, గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు బొత్స అప్పల నరసయ్య, నెల్లిమర్లలో వరుసకు సోదరుడయ్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఇలా అందరూ ఓటమి చెందారు. తాజాగా ఓటమిపై బొత్స స్పందించారు.

ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అన్నారు. నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను కొత్త ప్రభుత్వం పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు మేలు చేయాలనేది తమ ఉద్దేశం అన్నారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కంటే ప్రజలు ఇంకా ఎక్కువ కోరుకునే కూటమి అవకాశం ఇవ్వొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. ఓటమికి చాలా కారణాలు, విశ్లేషణలు ఉండొచ్చు వాటి గురించి మాట్లాడుకునేందుకు ఇది సందర్భం కాదని అన్నారు. తమ విధానం ప్రజలకు నచ్చకపోయి కూడా ఉండొచ్చు అని వెల్లడించారు.

Share this post

scroll to top