ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు.. అప్రజాస్వామ్యపాలన..

harish-rao-05.jpg

నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, డిమాండ్ల సాధనే లక్ష్యంగా టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. సోకాల్డ్ ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా? అని ప్రశ్నించారు. తమ గోసను రిప్రజెంటేషన్ ద్వారా చెప్పుకునే అవకాశం కూడా లేదా అని నిలదీశారు. ఒక వైపు ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ… నిరుద్యోగుల గొంతులను, హక్కులను అణగదొక్కే కుట్రలకు రేవంత్ సర్కారు పాల్పడుతరోందని ఆరోపించారు.

Share this post

scroll to top