నేడు 155వ గాంధీ జయంతి..

gabdhi-02.jpg

మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ సాధారణంగా మహాత్మా గాంధీ లేదా బాపు అని మనం పిలుచుకుంటాము. ఆయన గుజరాత్‌ లోని పోర్‌బందర్‌లో 1869 అక్టోబర్ 2న జన్మించారు. గాంధీజీ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో గొప్ప నాయకుడు, అహింస సూత్రం ఆధారంగా దేశానికి స్వాతంత్ర సాధించడంలో ముఖ్యమైన కృషి చేశారు. దాంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న ఆయన జయంతిని గాంధీ జయంతిగా జరుపుకుంటారు. గాంధీజీ ప్రాథమిక విద్యాభ్యాసం పోర్‌బందర్, రాజ్‌కోట్‌ లలో జరిగింది. ఆ తర్వాత ఇంగ్లండ్ వెళ్లి అక్కడ న్యాయశాస్త్రం అభ్యసించాడు. అతను 1891లో బారిస్టర్ డిగ్రీని పొందిన తరువాత భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కొంతకాలం న్యాయశాస్త్రంలో సేవలను అందించాడు. చట్టపరమైన కేసుకు సంబంధించి 1893లో దక్షిణాఫ్రికాకు వెళ్లిన తర్వాత, అతను అక్కడ జాతి వివక్షను ఎదుర్కొన్నాడు. ఇది సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటానికి అతన్ని ప్రేరేపించింది.

Share this post

scroll to top