హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు జరగుతోంది. ప్రతి ఒక్కరి కోసం పనిచేసే కృత్రిమ మేథస్సు అనే థీమ్‌తో ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ నిర్వహించడం దేశంలో ఇదే మొదటి సారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ సదస్సును ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి AI రంగంలో పేరొందిన ప్రముఖులు.. సంస్థల ప్రతినిధులు 2000 మంది ఈ సదస్సులో పాల్గొన్నారు. ఏఐ రంగంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఖాన్ అకాడమీ అధినేత సల్ ఖాన్, IBM నుంచి డానియెలా కాంబ్, XPRIZE ఫౌండేషన్ పీటర్ డయామండిస్ తదితర ప్రముఖులు ఈ సదస్సుకు హాజరయ్యారు ఏఐ రంగం అభివృద్ధికి తమ ఆలోచనలను పంచుకుంటారు. భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చలు జరుపుతారు. సామాజిక బాధ్యతగా సమాజంపై AI ప్రభావం, నియంత్రణ, సవాళ్లను చర్చిస్తారు.