చేతికొచ్చే పంటను మిచౌంగ్ తుఫాన్ మింగేసింది. చేతికొచ్చిన పంట నేడు నీట మునిగి రైతుల కంట కన్నీటిని మిగిల్చింది. మరో వైపు బస్తాల కెక్కిన ధాన్యం సగం పైగా తడిచిపోయాయి. కోత కోయని పంట నేలకొరిగి రైతు కష్టాన్ని మరోసారి వెక్కిరిస్తోంది. భారీ వర్షానికి రోడ్లపై పెద్ద ఎత్తున వరద చేరడంతో వడ్డు తడిచి ముద్దయ్యాయి. దీంతో రైతులు వడ్లు కొనమని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో రైతులు రోడ్డుపై ధర్నాకు దిగుతున్నారు. రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఖరీఫ్ 2023 కరవు పాయం, మిచౌంగ్ తుఫాను పంట నష్టం పరిహారం ఇవాళ నుంచి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. 11. 57 లక్షల మందికి 1, 289 కోట్లు అందించనుంది. ఖరీఫ్ రైతులకు 847 కోట్ల రూపాయలు సాయం చేయనుంది.