ఏపీలో కూటమి పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టారని.. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయాలను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేయడంపై శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో కూటమి సర్కార్ సాగిస్తున్న పాలన దేనికి సంకేతం?. కోర్టు ప్రొసీడింగ్‌లో ఉండగానే తాడేపల్లి కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేశారు. పైగా చేసిందంత చేస్తూ.. అసెంబ్లీలో నీతులు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నామని ఏదైనా చేస్తామంటే పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు వస్తాయి. మీకు వచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటున్నారనేది ప్రజలు గమనిస్తున్నారు’’ అని అన్నారాయన.