యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..

telangana-04.jpg

వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు కొత్తగా ఏవీ కోరడం లేదు. విపక్ష పార్టీగా కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన ఉద్యోగాలనే భర్తీ చేయమని కోరుతున్నారు. ఏడాదిలోపు 2 లక్షల ప్రభుత్వ కొలువులను భర్తీ చేస్తామనీ, గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో 1:100 విధానంలో క్వాలిఫై చేస్తామనీ, 4 వేల నిరుద్యోగ భృతి ప్రతి నెలా అందజేస్తామనీ హస్తం పార్టీ అధిష్టానమే హామీ ఇచ్చింది కదా? వాటితో పాటు మెగా డీఎస్సీ, నిరుద్యోగులకు రూ. 10 లక్షల వడ్డీలేని రుణాలు, ఉద్యమ అమరుల కుటుంబాలకు నెలనెలా 25 వేల పింఛన్లు, బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల భర్తీ… ఇలా ఎన్నో హామీలను రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చింది. వాటి కోసమే ఏడు నెలలు ఎదురుచూసిన తర్వాత, నేడు యువలోకం నిలదీస్తున్నది. గురుకులాల ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ ప్రక్రియలో మళ్ళీ బ్యాక్‌ లాగ్‌లు మిగలకుండా చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. వీటి కోసం అడిగీ, అడిగీ, ఏడు నెలలుగా హస్తం పార్టీ ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగి, ప్రయోజనం లేకనే నిరుద్యోగులు ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమిస్తున్నారు. మోతీలాల్‌ నాయక్‌ వంటి వారు నిరాహార దీక్షకు దిగుతున్నారు.

Share this post

scroll to top