రాజధాని రైతుల ఆందోళన..

capital-29.jpg

ఉండవల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి భూములిచ్చేందుకు కొందరు రైతులు అభ్యంతరం తెలిపారు. ఎవరెవరి భూమి ఎంత పోతుందో చెప్పడం లేదంటూ సీఆర్‌డీఏ అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ సేకరణ లేదా భూ సమీకరణ ద్వారా తీసుకుంటారా.. అనేది ఎందుకు చెప్పడం లేదంటూ రైతులు నిలదీశారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణంలో పంట పొలాలు కోల్పోతున్న రైతులతో సీఆర్‌డీఏ అధికారులు శనివారం సమావేశం నిర్వహించారు. పొలం కోల్పోతున్న అందరి రైతులకు అధికారులు సమాచారం ఇవ్వకుండా కేవలం కొందరికి మాత్రమే ఇచ్చారు. రైతులు ఆందోళనతో సమావేశాన్ని సీఆర్‌డీఏ అధికారులు అర్ధాంతరంగా ముగించారు.

Share this post

scroll to top