హనుమంతుడిని ఈ శ్లోకంతో ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం

హనుమంతుడిని ఏ నామాలతో పూజించాలి, ఏ శ్లోకాలతో ఆరాధించాలనేది చాలామందికి సందేహం. అయితే ఆయనకు సంబంధించి హనుమాన్‌ చాలీసా, ఆంజనేయదండకం పఠిస్తే మంచిది. ఇవి వీలుకాకుంటే కింద చెప్పిన శ్లోకం కనీసం 11 సార్లు పారాయణం చేస్తే మంచిది.

శ్లోకం – హనుమానంజనానూను: వాయుపుత్రోమహాబలః
రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ !!
ఈ శ్లోకాన్ని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాన్ని ధరించి కనీసం 11 లేదా అంతకంటే ఎక్కువసార్లు మనస్సులో చదువుకుంటే తప్పక అన్ని లభిస్తాయి.