మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో భాగంగా సరైన డైట్ చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. వీటిలో చాలా రకాలు ఉన్నప్పటికీ తప్పక తీసుకోవాల్సిందిగా కొన్నింటిని సజెష్ చేస్తుంటారు. అలాంటి వాటిలో చియా, దానిమ్మ, అవిసె గింజలు, గుమ్మడి గింజలు కూడా ఉన్నాయి.
బరువు తగ్గాలంటే..
ఇటీవల చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వీరు తమ డైట్‌లో దానిమ్మను తప్పకుండా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే దీని గింజల్లో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి.
ఎనర్జీకోసం గుమ్మడి గింజలు
ఇక పోషకాలు సమృద్ధిగా ఉండటంవల్ల గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఐరన్ కంటెంట్‌కు మూలం కాబట్టి, వీటిని డైట్‌లో చేర్చుకుంటే రక్త హీనత, వివిధ ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా ఉంటాయి.
నువ్వులతో గుండె ఆరోగ్యం
చిన్నగానే కనిపిస్తాయి కానీ నువ్వుల్లో పోషకాలు మాత్రం ఫుల్లుగా ఉంటాయి. ఫైటో న్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, డైటరీ ఫైబర్ వంటివి పుష్కలంగా ఉండటంవల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా ఒమేగా – 6 ఫ్యాటీ యాసిడ్స్‌కు నువ్వులు మూలం.
ఎముకల బలానికి చియా సీడ్స్
చియాసీడ్స్‌ను స్మూతీస్, డిజర్ట్, సలాడ్‌లలో వాడుతుంటారు. కాల్షియం ఫుల్లుగా ఉంటుంది కాబట్టి ఎముకల బలానికి సూపర్ ఫుడ్‌గా పేర్కొంటారు. వీటిని దీర్ఘకాలంపాటు డైట్‌లో చేర్చుకుంటూ ఉంటే ఎముకల ఖనిజాలు దృఢంగా తయారవుతాయి. లివర్ అండ్ గట్ హెల్త్‌కు కూడా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.