రెండు తెలుగు రాష్ట్రాల్లో సమృధ్ధిగా వర్షాలు కురుస్తున్న విషయం అందరికీ తెలిసెందే. కాగా నైరుతీ రుతుపవనాలు రుతుపవనాల కారణంగా ఈ నెల 22వ తేదిన బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేది వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.
కాగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలానే ఈ అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. కాగా ఈ ఉపరితల ద్రోణి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఆవరించినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ ఉపరితల ద్రోణి సముద్రమట్టానికి 3.1 కి.మీ. ఎత్తున కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది.