నవంబర్ 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం..

have-rain-22.jpg

సుమత్రా తీరంలో ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నవంబర్ 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత, ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, తదుపరి 2 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలి. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు చెట్లు పడిపోకుండా సపోర్టు అందించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచనలు చేశారు.

Share this post

scroll to top