హిందీ ‘విక్రమ్‌ వేద’ టీజర్‌

తమిళ్‌ లో విజరు సేతుపతి, మాధవన్‌ నటించిన ‘విక్రమ్‌ వేద’ చిత్రం అదే పేరుతో హిందీలో రాబోతోంది. హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రధాన తారాగణంతో దర్శకులు పుష్కర్‌, గాయత్రిలు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ని విడుదలచేశారు. సెప్టెంబర్‌ 30న ఈ చిత్రం విడుదలవుతోంది.