ఆంధ్రప్రదేశ్‌లో పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.. మంగళగిరి నియోజకవర్గంలో.. ఉదయమే స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.. ఇక, ఎక్కడికక్కడ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు హోంమంత్రి వంగలపూడి అనిత.. విజయవాడ నుంచి రోడ్డు మార్గన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆమె.. మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చారు.. రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొందని కొనియాడారు.. పెంచిన పెన్షన్ 4000 రూపాయలతో పాటు, ఎన్నికల సమయంలో మూడు నెలలు 3000 కలిపి మొత్తం 7000 రూపాయలు పెన్షన్లు లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిపాలన కొనసాగిస్తాం అన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత.. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరి వెళ్లారామె.