ఇంట్లోనే ఈజీగా శానిటైజర్ తయారు చేయండిలా..

కరోనా వైరస్ వ్యాపిస్తున్న వేళ శానిటైజర్ వినియోగం పెరిగింది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అయితే, అన్ని వేళలలో వాడడం వీలు కాదు కాబట్టి.. అలాంటప్పుడు మనం శానిటైజర్‌ని వినియోగించొచ్చు. మరి ఇలాంటి సందర్భంలో మనమే స్వయంగా శానిటైజర్ తయారు చేస్తే బావుంటుంది. దీనిలో ఎలాంటి కెమికల్స్ కూడా ఉండవు కాబట్టి.. ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించొచ్చు. దీని వల్ల చేతులు కూడా మృదువుగా ఉంటాయి. క్రిములు కూడా చాలా వరకూ నాశనం అవుతాయి. అలాంటి శానిటైజర్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఇందులో వాడే పదార్థాలన్ని కూడా చర్మానికి మేలు చేసేవే.. అంతే కాకుండా అందరికీ ఈజీగా దొరికేవి. కాబట్టి.. ఎలాంటి వారైనా వీటిని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. అన్ని పదార్థాలు మనకు అందుబాటులో ఉంటే కేవలం 5 నిమిషాల్లోనే దీనిని తయారు చేయొచ్చు. ఇందులో ఉపయోగించే పదార్థాలు కూడా అన్ని సూపర్‌ మార్కెట్స్‌లో మనకి అందుబాటులో ఉంటాయి. అవే..

  • 1/2 బాటిల్ రబ్బింగ్ ఆల్కహాల్
  • 2 స్పూన్ల అలొవెరా జెల్
  • 8 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్
  • 1 స్క్వీజ్ బాటిల్

తయారీ విధానం..

ముందుగా ఓ బౌల్ తీసుకోవాలి. అందులో హాఫ్ బాటిల్ రబ్బింగ్ ఆల్కహాల్‌ని వేయాలి. ఇప్పుడు అందులోనే 2 స్పూన్ల అలోవెరా జెల్‌ని వేయాలి. ఈ రెండింటిని ఇలా బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ అయిన తర్వాత అందులో 8 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి. ఇందులో ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. అయితే, తీసుకున్న పదార్థాలన్ని బాగా కలిసేలా ఓ స్పూన్‌తో బాగా కలపాలి. ఇలా తయారైన శానిటైజర్‌ని నీటి తడిలేని స్క్వీజ్ బాటిల్‌లో పోసుకోవాలి. అయితే, ఇదే ఒక్కసారిగానే ఎక్కువ పరిమాణంలో చేసుకోకూడదు. వారానికి ఓ సారి సరిపోయేలా చేసుకుంటే సరిపోతుంది.