రాష్ట్రంలో ఎన్డీయే కూటమి, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో తిరుపతి జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఆపై హత్య ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనపై వైసీపీ స్పందిస్తూ సంచలన ట్వీట్ చేసింది. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కక్ష సాధింపుల పై కాకుండా శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలని వైసీపీ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించింది. తిరుపతి జిల్లాలో మూడున్నరేళ్ల బాలికపై లైంగిక దాడి ఘటనను మెన్షన్ చేస్తూ విమర్శలు గుప్పించింది. మీ చేతగానితనంతో ఇంకెంత మంది బాలికలు ఇలా బలి అవ్వాలి పవన్ కళ్యాణ్ అని వైసీపీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.