డియోడ్రెంట్స్ ఇంట్లోనే చేసుకోండిలా..

చెమట వాసన తగ్గించుకోడానికి మనందరం కమర్షియల్ డియోడరెంట్స్ వాడతాం. కానీ, అవి వాడడం మంచిది కాదని నిపుణుల సలహా. దానికి మెయిన్ రీజన్ కమర్షియల్ డియోడరెంట్స్ లో ఉండే అల్యూమినియం బేస్డ్ కాంపౌండ్స్, పారబెన్స్, ఫ్రాగ్రెన్స్ కోసం యాడ్ చేసే టాక్సిక్ కెమికల్స్ వంటివి మనకి చాలా హాని చేస్తాయి. ఈ కెమికల్స్ వల్ల బ్రెస్ట్ కాన్సర్, అల్జైమర్స్ వంటివి వచ్చే అవకాశం పెరుగుతుంది. పైగా, డియోడరెంట్స్ అప్లై చేసుకునే ఆర్మ్ పిట్స్ దగ్గరే లింఫ్ నోడ్స్ కూడా ఉంటాయి. అక్కడికి ఈ టాక్సిక్ కెమికల్స్ చేరడం అస్సలు మంచిది కాదు.

కావాల్సిన పదార్ధాలు

– కొబ్బరి నూనె – 1/3 కప్
– బీస్వాక్స్ – 3 టేబుల్ స్పూన్స్, తురుముకోవాలి
– షియా బటర్ – 2 టేబుల్ స్పూన్స్
– కార్న్ స్టార్చ్ – 1/3 కప్
– బేకింగ్ సోడా – 1 టేబుల్ స్పూన్
– మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ – 10-15 చుక్కలు
– డియోడరెంట్ కంటెయినర్స్

తయారు చేయడం..

1. మూడు టేబుల్ స్పూన్ల బీస్వాక్స్ ని ఒక డబుల్ బాయిలర్ లో ఉంచండి.
2. దానికి రెండు టేబుల్ స్పూన్ల షియా బటర్ కలపండి.
3. తరువాత 1/3 కప్ కొబ్బరి నూనె కలపండి.
4. బీస్వాక్స్, బటర్, కొబ్బరి నూనెని కరగనివ్వండి.
5. వేడి మీద నించి దించేసి అందులో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/3 కప్ కార్న్ స్టార్చ్ యాడ్ చేయండి.
6. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా స్పాట్యులా తో కలపండి.
7. ఇప్పుడు అందులో పది, పదిహేను చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. మీరు ఒక ఆయిలే వాడచ్చు, లేదా రెండు మూడు ఎసెన్షియల్ ఆయిల్స్ కలిపి కూడా వాడచ్చు.
8. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సిలికాన్ మోల్డ్స్ లోకో, డియోడరెంట్ స్టిక్స్ లోకో పోయండి.
9. అది చల్లారి ఒక ఫార్మ్ లో సెటిల్ అవ్వడానికి రెండు గంటలు పడుతుంది.
10. ఆ తరువాత మీ హోం మేడ్ డియోడరెంట్ తయారైపోయింది.