పులివెందులలో రెండ్రోజులపాటు వైఎస్‌ జగన్‌ పర్యటన

ys-jagan-18-1.jpg

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన ఖరారైంది. రేపటి నుంచి రెండ్రోజులపాటు సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక తొలిసారి ఆయన పులివెందులకు వెళ్తున్నారు. బుధవారం మధ్యాహ్నాం తాడేపల్లి నుంచి బయల్దేరి సాయంత్రం కల్లా అక్కడికి చేరుకుంటారు. ఈ పర్యటనలో రాయలసీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యి.. ఆయన భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నాం కల్లా పులివెందుల పర్యటనను ముగించుకుని తిరిగి తాడేపల్లికి చేరుకుంటారాయన. వాస్తవానికి రేపు ఉదయం జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం జరగాల్సి ఉంది. అయితే జగన్‌ పులివెందుల పర్యటన నేపథ్యంలోనే 22వ తేదీకి ఆ సమావేశాన్ని వాయిదా వేసింది.

Share this post

scroll to top