రీజనల్ రింగ్ రోడ్డుపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకీలక ప్రకటన చేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఈరోజు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన సమస్యలపై చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్డుపై లోతుగా చర్చించామని.. వారు దానికి అంగీకరించారని వివరించారు. విజయవాడ – హైదరాబాద్ రోడ్డుకు టెండర్లను పిలిచేందుకు అంగీకరించారని చెప్పారు. హైదరాబాద్ – కల్వకుర్తి రోడ్లు, ఇతర రోడ్ల పై చర్చ జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని సహాయక సదుపాయాలు కలిపిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీకి చెప్పామని అన్నారు. వారం రోజుల్లో హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్న నితిన్ గడ్కారీ ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు.