ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్…ఇక ఈ ముచ్చటే బంద్ కానుంది. ఇకపై ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్లేనని తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ఏపీ విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ 2 తారీకున ముగియనుంది.
దీంతో హైదరాబాద్లో ఉన్న ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఏపీకి మార్చబడుతున్నాయి.. 2016లో 90% కార్యాలయాలు తెలంగాణ నుండి ఏపీకి మారగా.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి కర్నూలుకు మార్చారు. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నిలిచిపోయే జూన్ 2వ తేదీలోపు హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న భవనాలన్నింటినీ ఖాళీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఏపీఈఆర్‌సీ కార్యాలయాన్ని కర్నూలుకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.