హైదరాబాద్ లో ఆక్రమణలకు గురైన చెరువులు, నాళాలను పరిరక్షించడమే ధేయంగా ఏర్పాటైన హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు 23 చోట్ల 262 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూల్చివేత వ్యర్థాలను తొలగించేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఆఫ్ లైన్ లో టెండర్లు ఆహ్వానించిన హైడ్రా అధికారులు సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 27 వరకు బిడ్లు స్వీకరించనున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఏడాది కాలపరిమితితో ఈ బిడ్లను ఆహ్వానించారు.