వరస బాయిలర్ పేలుడు ఘటనలతో ఎన్టీఆర్ జిల్లా దద్దరిల్లుతోంది. జగ్గయ్యపేట మండలం బూదవాడ వద్ద అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుడు ఘటన మరవక ముందే ఇబ్రహీంపట్నం లో మరో ప్రమాదం వెలుగు చూసింది. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఐదవ యూనిట్ బాయిలర్‌లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను హుటాహుటిన చికిత్స నిమిత్తం గొల్లపూడి ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు.
- Home
- News
- Andhra Pradesh
- వరస బాయిలర్ పేలుడు ఘటనలతో దద్దరిల్లుతున్న ఎన్టీఆర్ జిల్లా..