ఐస్‌క్రీమ్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రాత్రిపూట ఐస్ క్రీం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాత్రి డిన్నర్ తర్వాత ఐస్ క్రీమ్ తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా విపరీతంగా బరువు పెరిగి, ఊబకాయం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు..ఐస్ క్రీమ్‌లో కెలరీలు ఎక్కువగా ఉంటాయి. చక్కెర, కొవ్వు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మన బరువు పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
నైట్ టైమ్ ఐస్‌క్రీమ్ తినడం వల్ల నిద్ర లేమి సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం లాంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అందువలన రాత్రి సమయంలో అస్సలే ఐస్ క్రీమ్ తినకూడదని ఒక వేళ మీకు నైట్ టైమ్ స్వీట్ తినాలనిపిస్తే తేనే, స్వీట్ ఫ్రూట్స్, డార్క్ చాక్లెట్ మొదలైన వంటి వాటిని తీసుకోవాలని చెబుతున్నారు. పండ్లు, పెరుగుతో చేసిన ఫ్రూట్ స్మూతీస్ తినండి. దీని వలన ఆరోగ్యం బాగుండటమే కాకుండా , అతి బరువు, ఊబకాయం నుంచి తప్పించుకోవచ్చు.