దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ నెల 9న ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి మిత్రదేశాల నేతలను కేంద్రం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాధినేతలు ఉన్నారు. ఇందులో భాగంగా మోదీ ఇప్పటికే నేపాల్ ప్రధాని ప్రచండ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘేను సంప్రదించారు.