సెట్స్‌ పైకి ‘ఇండియన్‌ 2’

కమల్‌ హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌లో ఇండియన్‌ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిర్మాతలకు, శంకర్‌కు మధ్య వచ్చిన గొడవలు, కరోనా వంటి కారణాలతో చిత్రీకరణ దశలోనే నిలిచిపోయింది. దాంతో శంకర్‌ రామ్‌ చరణ్‌ హీరోగా ‘ఆర్‌సి15’ షూట్‌ చేస్తున్నారు. గత నెల రోజుల నుంచి షూటింగ్‌ ఆగిన నేపథ్యంలో శంకర్‌ ‘ఇండియన్‌ 2’పై దృష్టి పెట్టారు. మంగళవారం రాత్రి నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. దీనిలో భాగంగానే ఇండియన్‌ 2కి సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. లైకా ప్రొడక్షన్స్‌తో పాటుగా రెడ్‌ జయింట్‌ సంస్థ కూడా నిర్మాణంలో భాగం అయ్యినట్టుగా మేకర్స్‌ ప్రకటించారు. ఈ తాజా ఈ షెడ్యూల్‌లో కమల్‌, కాజల్‌, రకుల్‌ ప్రీత్‌ అందరూ పాల్గొన్నారు.