ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ కాంబోలో కొత్తమూవీ.. టైటిల్ కూడా వచ్చేసిందిగా !

jr-ntr-new-.jpg

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ సినిమాలంటేనే సినీ లవర్స్‌లో అదో క్రేజీ. ఆయన నటించే మూవీస్‌ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఈగర్‌గా ఎదురు చూసేవారు చాలా మందే ఉంటారు. అయితే తారక్‌కు సంబంధించిన మరో కొత్త న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏంటంటే.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ కొత్త మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 20న ఆయన బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి అప్‌డేట్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వెలువడింది.

అయితే ప్రజెంట్ ఎన్టీఆర్ మూవీకి సంబంధించి ఫుల్ డిటెయిల్స్‌తోపాటు టైటిల్‌ను కూడా ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ మేరకు టైటిల్ పేరు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్‌ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు ‘డ్రాగన్‌’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారట. ప్రజెంట్ దీని గురించి తారక్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో ఫుల్ డిస్కషన్ నడుస్తోంది.

ఈ టైటిల్ నిజమా కాదా అనేది అఫీషియల్‌గా అయితే ప్రకటించలేదు కాబట్టి మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ప్రశాంత్ నీల్ ఇప్పుడు స్క్రిప్ట్‌కు ఫైనల్‌ టచ్‌ ఇచ్చే పనిలో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక తారక్‌ అయితే ప్రస్తుతం వరుస షూటింగ్‌లతో తీరిక లేకుండా ఉన్నందున ఆ చిత్రీకరణ పూర్తయ్యాకనే ‘ఎన్‌టీఆర్‌ 31’ సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర, వార్‌ 2 చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Share this post

scroll to top