ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఒక నియంతలా వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చి వేయించారని ట్విటర్ వేదికగా విమర్శించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారని అన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు హింసాత్మక ఘటనలతో రాష్ట్రంలో రక్తాన్ని పారిస్తున్నారని జగన్ అన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలన ఎలా ఉండబోతుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ అని పేర్కొన్నారు.