టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మహిళ హైదరాబాదులోని రాయ్ దుర్గ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు బెదిరింపు (506), గాయపరచడం (323), క్లాజ్ (2) కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాదిత మహిళని ఓ రహస్య ప్రదేశంలో విచారణ చేపడుతున్నారు పోలీసులు. ఔట్ డోర్ షూటింగ్స్ లో జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ మహిళ. ప్రస్తుతం జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.