మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. శనివారం కడప ఎయిర్‌పోర్టు నుంచి జగన్ రిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. నిన్న వైసీపీ నేత, మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి అనుచరుడు వేంపల్లి అజయ్ కుమార్ రెడ్డిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రస్తుతం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వైఎస్ జగన్.. అజయ్ రెడ్డిని పరామర్శించేందుకు రిమ్స్‌కు వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనపై జరిగిన దాడి వివరాలను జగన్‌కు అజయ్ తెలియజేశారు. నిన్న తనపై హాకి స్టిక్స్, రాడ్లు, బండరాళ్లతో దాడి చేసినట్లు జగన్‌తో బాధితుడు పేర్కొన్నాడు. వేంపల్లి మండలం టిడిపి పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి, రవితేజ మనుషులు దాడి చేసినట్లు అతడు తెలిపాడు. అయితే పోలింగ్ రోజు జరిగిన ఓ సంఘటనకు సంబంధించి మనసులో పెట్టుకొని అజయ్ రెడ్డిపై దాడి జరిగినట్లుగా సతీష్ రెడ్డి వర్గం భావిస్తోంది.