రేవతి దర్శకత్వంలో కాజోల్ సినిమా

బాలీవుడ్‌ హీరోయిన్‌ కాజోల్‌ తన కొత్త సినిమా ప్రాజెక్టు వివరాలను అభిమానులకు వెల్లడించింది. నటి, దర్శకురాలు రేవతి దర్శకత్వంలో తన కొత్త సినిమా చేయబోతున్నట్లు ప్రకటించింది. ‘ది లాస్ట్‌ హుర్రే’ టైటిల్‌తో వస్తున్న సినిమా కథ తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగే ఓ తల్లి కథ కావడంతో నటించేందుకు తాను ఒకే చెప్పారు. చిత్రంలో సుజాత క్యారెక్టర్‌ గురించి విన్న వెంటనే తన మైండ్‌లోకి కాజోల్‌ వచ్చిందని, తనే ఈ పాత్రకు న్యాయం చేస్తుందని రేవతి అన్నారు. ఆ పాత్రలో ఇవ్వాల్సిన హావభావాలు, లక్షణాలు అన్నీ కాజోల్‌లో కనిపించాయన్నారు. అందుకే ఆమెను ఎంచుకున్నట్లు తెలిపారు. బిలివ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమాను సూరజ్‌ సింగ్‌, శ్రద్ధా అగర్వాల్‌ నిర్మిస్తున్నారు.