మొదటిరోజు రూ.100 కోట్లుపైన.. ‘కల్కి’కి  ఆ రికార్డ్‌ దక్కలేదు!

kalki-29.jpg

ప్రభాస్‌హీరోగా నాగ్‌ అశ్విన్  దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాక్సాఫీస్‌  వద్ద దూసుకుపోతోంది. మైథలాజికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటిరోజు రూ.191.5కోట్లు వసూలు చేసిందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. పాన్  ఇండియా ట్రెండ్‌ నడుస్తున్న తరుణంలో అనేక చిత్రాలు మొదటి రోజు కలెక్షన్లు సులభంగా రూ.100 కోట్ల కలెక్షన్లను రాబడుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ‘కల్కి’ కూడా వచ్చి చేరింది. రూ.100 కోట్ల రికార్డును సాధింంచిన 11వ చిత్రంగా ‘కల్కి’ నిలిచింది. అంతే కాదు ఆ జాబితాలో ప్రభాస్‌ నటించిన ఐదో చిత్రం కావడం మరో విశేషం. తొలిరోజు రూ.100 కోట్లు పైన వసూలు చేసిన చిత్రాల లిస్ట్‌లో మొదటి స్థానంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఉంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి రోజు రూ.223 కోట్లు వసూలు చేసింది. దీని తర్వాత స్థానంలో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ఉంది. ఇది రూ.217 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్‌ పెద్దల అంచనా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.191.5 కోట్లు వసూలు చేసి మూడో స్థానంలో నిలిచింది ‘కల్కి 2898 ఏడీ’. తర్వాతి స్థానాల్లో ‘కేజీయఫ్‌2’ – రూ.159 కోట్లు, సలార్‌: పార్ట్‌1 – రూ.158 కోట్లు, లియో – రూ.142.75 కోట్లు, సాహో – రూ.130 కోట్లు,  జవాన్‌ – రూ.129 కోట్లు, ఆది పురుష్‌ – రూ.127.50 కోట్లు, యానిమల్‌ – రూ.116 కోట్లు, పఠాన్‌ – రూ.105 కోట్లు చిత్రాలు ఉన్నాయి. మరో రూ.26 కోట్లు పైచిలుకు వసూళ్లు రాబట్టి ఉంటే బాహుబలి మొదటి రోజు రికార్డ్‌ను కల్కి క్రాస్ట్‌ చేసేది. కానీ జస్ట్‌ మిస్‌ అయింది. 

Share this post

scroll to top