ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యూడిషియల్ రిమాండ్ ను ట్రయల్ కోర్డు పొడిగించింది. జూలై 18 వరకు పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మద్యం విధానంలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని సీబీఐ ఏప్రిల్ 11న ఎమ్మె్ల్సీ కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కవితపై విధించిన జ్యూడిషయల్ రిమాండ్ ఈ రోజుతో ముగిసింది. దీంతో కవితను తీహార్ జైలు అధికారులు వర్చువల్ గా ట్రయల్ కోర్టు ముందు హాజరు పరిచారు.ఈ కేసులో సీబీఐ కవితపై చార్జిషీట్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు జ్యూడిషియల్ కస్టడీని మరోసారి పెంచింది. జూలై 18 వరకు రిమాండ్ విదిస్తూ.. ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. కాగా ఇప్పటికే లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవితకు జూలై 25 వరకు జ్యూడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు ప్రకటించింది.