టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె శుక్రవారం ఉదయం స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో శేష వస్త్రంతో సత్కరించారు. అలాగే పూజారులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. వచ్చే నెలలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. తన వెడ్డింగ్ గోవాలో జరగనున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.