టాలీవుడ్ ఇండస్ట్రీలో కీర్తి సురేశ్ గురించి సుపరిచితమే. తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మడుకు మంచి ఫ్యాన్స్ ఫాలొయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ సినీ కేరిర్‌లో గతంలో చేసిన సినిమాలు ఒక ఎత్తు ఐతే మహానటి మూవీ మరో ఎత్తు అని చెప్పవచ్చు. ఆ మూవీలో సావిత్రి గారి లాగే అద్భుతంగా నటించింది మరోసారి తెరపై సావిత్రిని చూపించిందనే చెప్పవచ్చు. ఆమె కెరీర్ కు కూడా ఈ సినిమా ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు.
సావిత్రి గారు తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే మరో పాత్ర చేయలేదంటే ఆ ప్రభావం ఏ స్థాయిలో ప్రేక్షకుల మనసులో ముద్రించుకు పోయిందో అర్థమవుతుంది. ఇప్పుడు మరో బయోపిక్ లో కీర్తి సురేష్ నటించబోతుందని ఓ వార్త కొలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో మెప్పించిన కీర్తి సురేశ్..ఇప్పుడు లెజెండరీ సింగర్ దివంగత ‘MS సుబ్బలక్ష్మి’ జీవిత కథలో నటించనున్నారని తెలుస్తోంది. తమిళనాడులో జన్మించిన సుబ్బలక్ష్మి గొప్ప గాయనిగా ఎలా ఎదిగారు? జీవితంలో ఘటనలన్నీ ఇందులో ఉంటాయని సమాచారం. కోలీవుడ్ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కిస్తారని త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవుతాయని సమాచారం.