రాజధాని అమరావతి పర్యటనలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాయపూడి సమీపంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను స్పీకర్ సందర్శించారు. సీఆర్‌డీఏ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యేల కోసం తెలుగుదేశం హయాంలో నిర్మించిన 12 టవర్లు 288 స్లాట్‌ల వివరాలను స్పీకర్ అడిగి తెలుసుకున్నారు. ఫ్లాట్లలోకి వెళ్లి అనువణువునూ పరిశీలించారు. అనంతరం అయ్యన్న మాట్లాడుతూ.. ఢిల్లీలోను హైదరాబాదులో కూడా శాసనసభ్యులకు, ఎంపీలకు ఇలాంటి ఫెసిలిటీ లేదన్నారు. ఎంతో చక్కటి ప్లాన్‌తో విశాలంగా ఈ భవంతులను నిర్మించారన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇవి పాడు పడిపోయే పరిస్థితికి వచ్చాయని విమర్శించారు. గతంలో ఉన్న కాంట్రాక్టర్‌లు ఈ భవనాలను పాత ధరలకు పూర్తి చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో ఈ భవనాలను పూర్తి చేయడానికి మరో రూ.300 కోట్లు అదనంగా ఖర్చవుతుంది అని చెబుతున్నారన్నారు.