ఏపీ మాజీ మంత్రి, వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఊహించిన పరిణామం ఎదురైంది. ఆయనకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారట. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు ఆయన స్వగృహంలో నందివాడ మండల YCP నాయకులతో మాట్లాడుతూ.. సోఫాలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
దీంతో అప్రమత్తమైన నేతలు, గన్‌మెన్లు సపర్యలు చేసి.. డాక్టర్లకు సమాచారం అందించారు. ఈ ఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. దీంతో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకొని హైదరాబాద్ నుండి గుడివాడ బయలుదేరారట కొడాలి నాని కుటుంబ సభ్యులు. అటు ఆందోళనలో గుడివాడ వైకాపా శ్రేణులు ఉన్నారట. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.