ఏపీలో అందుకేనా టీడీపీ సైకో చర్యలు..

chandrababu-05.jpg

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే ఒక వైఎస్సార్‌సీపీ నేత భవనం కూల్చివేత జరిగింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులను టీడీపీ వారు వేధిస్తూనే ఉన్నారు. విధ్వంసం, దహనాలు జరిగిపోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఇష్టారాజ్యంగా దగ్ధం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సైకో ప్రభుత్వం నడుస్తోందని, ఏపీలో ఆటవిక రాజ్యం రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోందని అనిపించడం లేదా! ఇదేనా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా అనుభవం కలిగి, మరోసారి సీఎం అయిన చంద్రబాబు నుంచి ప్రజలు ఆశించింది!

ఆయన రాజ్యంలో పోలీసులు బాధితులపై కేసులు పెడుతున్నారు. బాధితులపై దాడులు చేస్తున్నవారికి అండగా నిలుస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవడానికి పోలీసులు అనుమతించడం లేదు. ఇదంతా ప్రజాస్వామ్య స్పూర్తిగా తీసుకోవాలన్నమాట. రాజంపేట లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన నియోజకవర్గమైన పుంగనూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుంటే అక్కడకు వెళ్లకూడదని పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేసిన తీరు పోలీసుల అసమర్ధతకు అద్దం పడుతుందని అనుకోవాలి.

Share this post

scroll to top