ప్రభుత్వ హాస్టళ్ల దుస్థితిపై కేటీఆర్ ఫైర్..

ktr-10-1.jpg

మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి” అని అన్నారని.. మొత్తానికి.. కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్ద మార్పే తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో.. ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి.. పురుగుల అన్నం.. నీళ్ల చారు ఉండేవన్నారు. ఈనాటి కాంగ్రెస్ పాలనలో.. ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి ఉందన్నారు. బల్లిపడిన టిఫిన్లు – చిట్టెలుకలు తిరిగే చట్నీలు పిల్లలకు వడ్డిస్తున్నారన్నారని ఫైర్ అయ్యారు. మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో.. కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతంగా మారిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు.

Share this post

scroll to top