చుక్కనీరు లేని చెరువులు… పాత అప్పులు కట్టాలని రైతులకు నోటీసులు… పదేళ్ల తర్వాత తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు… విత్తనాల కోసం రైతుల మొక్కులు… క్యూలైన్లో పాస్‌బుక్కులు… వీటిని మళ్లీ… ఈ కాంగ్రెస్ పాలనలో చూస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు… 6 నెలల పాలనలోనే ఆవిష్కృతమయ్యాయయన్నారు. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు.