ఐటీ ఎగుమతులు, ఉద్యోగాలు క్షీణించటం పై కేటీఆర్ ఆందోళన వ్యక్తం.. 

ktr-6.jpg

తెలంగాణలో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాలు క్షీణించటం పై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది తో పోలిస్తే ఈ ఏడాది ఐటీ ఎగుమ‌తులు, ఉద్యోగాల్లో క్షీణతకు సంబంధించిన గణంకాలను ఆయన ట్వీట్ చేశారు. 2022-23 సంవ‌త్సరంలో తెలంగాణ‌ నుంచి 57,706 కోట్ల ఐటీ ఎగుమ‌తులు ఉంటే 2023-24 కాలానికి 26,948 కోట్ల ఎగుమతులే జరిగాయని అన్నారు. ఇక ఐటీ ఎంప్లాయిమ్మెంట్ కల్పన కూడా భారీగా పడిపోయింది. 2022-23 కాలంలో 1,27,594 కొత్త ఉద్యోగాలు వస్తే… 2023-24 లో కేవ‌లం 40,285 ఉద్యోగాలు మాత్రమే కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరేడేళ్లలో తెలంగాణలో ఐటీ ప్రగతి గణనీయంగా పెరిగేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. సింగిల్ విండో విధానం, టీఎస్ ఐపాస్, ఐటీ రంగానికి సంబంధించి ప్రభుత్వ పాలసీల కారణంగా అత్యంత వేగంగా హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ ను దేశానికి ఐటీ కేంద్రంగా చేసేందుకు ఎంతో కృషి చేశామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐటీ రంగాన్ని పూర్తిగా విస్మరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్థిక ప్రగతికి ఐటీ రంగం పురోగతి ఎంతో మేలు చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఐటీని రంగాన్ని పట్టించుకోకపోతే రాష్ట్రం ఆర్థికంగా, ఉపాధి కల్పన పరంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు.

Share this post

scroll to top