‘CM చంద్రబాబు రూ.లక్ష కోట్లు డిమాండ్’..ప్రచారంపై స్పందించిన కేటీఆర్

cbn-11.jpg

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏపీ అప్పులు ఊబిలో కూరుకుపోయిందని సీఎం నిన్న నిర్వహించిన ఆర్థిక సమీక్షలో వివరించారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని భారీ ఆర్థిక సాయం కోరినట్లు తెలుస్తోంది. నేడు సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. తమ రాష్ట్రానికి రూ. లక్ష కోట్లకు పైగా సాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన అడిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అంశంపై తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. ఈ నెలాఖరులో కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో చంద్రబాబు చేసిన డిమాండ్లు బడ్జెట్ పై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ అభివృద్ధికి రూపాయల లక్ష కోట్లు ఆర్థిక సాయం ఇవ్వాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఢిల్లీలో అనుకున్నది సాధించాలంటే ప్రాంతీయ పార్టీలకు ఓటు వేయాలనేది ఇందుకే అని అన్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఆశిస్తున్నానన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీ రామ రక్ష అంటూ ట్వీట్ చేశారు.

Share this post

scroll to top