తెలంగాణకు పునర్జన్మనిచ్చింది కరీంనగర్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కరీంనగర్ జిల్లా అల్గునూర్‌లో దీక్షా దివస్ సభలో కేటీఆర్ ప్రసంగించారు. 1956 నుంచి 1968 వరకు తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలయ్యిందన్నారు. తొలిదశ ఉద్యమంలో 370 మంది బలిదానం అయ్యారని 1971 నుంచి 30 ఏళ్ళ పాటు మేధావులు ఉద్యమకారులు ఎదురు చూశారన్నారు. అప్పుడే కలిసివచ్చే కాలానికి కేసీఆర్ నడిచి వచ్చాడన్నారు. కరీంనగర్ సింహగర్జనతో కేసీఆర్ ఉద్యమబాట పట్టాడన్నారు.