బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఆయన ఇవాళ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ను కలవబోతున్నారు. అమృత్ టెండర్ల విషయంలో జరిగిన అవకతవకలపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయబోతున్నారు. రూ. 8,888 కోట్ల విలువైన టెండర్లను సీఎం రేవంత్‌రెడ్డి బావమరిదికి అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్ గతంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో టెండర్ల విషయంలో సృజన్‌రెడ్డికి చెందిన షోధ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిడెట్ కంపెనీపై ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరారు.