వైసీపీ నేత హత్యకు కుట్ర.. చంద్రబాబు నియోజకవర్గంలో కలకలం

వైసీపీ నేత హత్యకు కుట్ర.. చంద్రబాబు నియోజకవర్గంలో కలకలం

చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత హత్యకు కుట్ర జరిగింది. పీలేరుకు చెందిన రౌడీషీటర్ గణేష్‌కు రూ.10లక్షలు సుపారీ ఇచ్చి విద్యాసాగర్‌ను హత్య చేయించేందుకు ప్లాన్ చేశారు. అడ్వాన్స్‌గా కొంత డబ్బును చెల్లించారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి ఫోన్ కాల్ ద్వారా తెలుసుకున్న విద్యాసాగర్.. కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ హత్యకు కుట్రకు సంబంధించి ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సుపారీ ఇచ్చింది ఎవరనేదానిపై ఆరా తీస్తున్నారు. విద్యాసాగర్ ఎన్నికలకు ముందు టీడీపీను వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయన హత్య కుట్రతో కుప్పం ఉలిక్కిపడింది. ఈ ప్లాన్ వెనుక ఎవరున్నారో తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. కుప్పం ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో కలకలంరేపుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.