‘గౌరవ ఆచార్య’ పోస్టును వక్రీకరిస్తారా..

lakshmi-15.jpg

ఆంధ్ర యూనివర్సిటీ తనకు ఇచ్చిన గౌరవ ఆచార్య పోస్టును వక్రీక రిస్తూ ఎల్లో మీడియా అసత్య కథనాలు ప్రచు రిస్తోందని తెలుగు, సంస్కృత అకాడమీ మాజీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి మండి పడ్డారు. వాస్తవాలను మరుగునపరిచి ఏయూ లో తనకు జీతంతో కూడిన ఆచార్య పోస్టులను కట్టబెట్టినట్లు రాయడం సిగ్గు చేటని మంగ ళవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. డబుల్ పీహెచ్ఎ చేసిన తనలాంటి వ్యక్తులకు గౌరవంగా ‘గౌరవ ఆచార్య’ పోస్టులను యూజీసీ నిబంధనల ప్రకారమే ఇచ్చినట్లు పేర్కొన్నారు. తెలుగు, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం కలిగి, ఎన్నో పుస్తకాలు రచించిన వారు విద్యార్థులకు మార్గదర్శకులవుతారనే ఉద్దేశంతో వర్సిటీ తనను గౌరవ ఆచార్యగా నియమించిందని తెలిపారు. ఇలాంటి యూ జీసీ కొత్త మార్గదర్శకాలను ప్రధాని మోదీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చేర్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకవేళ ఈ మార్గదర్శకాలను ఎల్లో మీడియా అంగీకరించకుంటే రద్దు చేయాలని ప్రధానికి, ఏపీ సీఎంతో లేఖ రాయించాలని డిమాండ్ చేశారు. గౌరవ సూచకంగా ఇచ్చిన పోస్టుకు ఏ రూల్ ప్రకారం జీతం ఇస్తారో ఎల్లో మీడియా చెప్పాలన్నారు. తాను ప్రధాన గైడ్ అయినప్పటికీ ప్రతి విద్యార్థికి వర్సిటీలోని ప్రొఫెసర్లు గైడ్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. భారత్లోనే ఏయూకి 3వ స్థానం దక్కగా.. ఎల్లో మీడియా రాజకీయాలతో బురదజ ల్లుతున్న మాజీ వీసీ ప్రసాదరెడ్డి హయాంలోనే న్యాక్ ఏప్లస్ ప్లస్ స్థాయికి ఎదిగిన విషయాన్ని విస్మరించ వద్దన్నారు.

Share this post

scroll to top